భజరంగి భాయిజాన్ కథకు క్లారిటీ ఇచ్చిన రైటర్

July 22, 2015 | 05:08 PM | 6 Views
ప్రింట్ కామెంట్
vijayendra_prasad_bajrangi_niharonline

ఎక్కడో ఏదో విషయం విన్న దానికీ, వార్తల్లో చదివిన దానికీ ఓ కథా రూపం మనసులో ఏర్పడి పోతుంది. ఓ దృశ్యం చూసిన దాన్ని బట్టి మనసులో ఓ సీన్ క్రియేట్ అయిపోతుంది దర్శకులకు. బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలు కొడుతున్న తాజా చిత్రం ‘భజ్రంగీ భైజాన్’.ఈ చిత్రానికి ప్రముఖ తెలుగు రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఈ చిత్ర ట్రైలర్ విడుదలైన క్షణం నుంచి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘పసివాడి ప్రాణం’ చిత్రం తరహాలోనే ఉందని అందరూ అనుకున్నారు.  కొందరు కాపీ అంటూ కామెంట్ చేశారు కూడా. ‘భజ్రంగీ భైజాన్’ విడుదలైన తర్వాత ఆ కామెంట్లు మరింత ఎక్కువయ్యాయి. కానీ ఇదే విషయంపై రచయిత విజయేంద్రప్రసాద్ కూడా స్పష్టం చేసాడు. ‘‘చిరంజీవి నటించిన ‘పసివాడి ప్రాణం’ చిత్రం అప్పట్లో నన్ను బాగా కదిలించింది. ఆ చిత్రాన్ని పూర్తి మార్చులు, చేర్పులతో కాంటెంపరరీ టచ్ ఇచ్చి చేయాలనుకున్నానని, కానీ ఈలోగా తాను ఓ పాకిస్థానీ జంట తమ కుమార్తెకు గుండె ఆపరేషన్ నిమిత్తం అక్కడ ఖర్చుకు భరించలేక ఇండియాకు వచ్చి ఆపరేషన్ చేయించుకున్నట్లుగా మీడియాలో వార్త చూసానని.. అందుకే ఆ కథను సిద్ధం చేసా’’నని అన్నారు. 
దేవ దాసు బాగా నచ్చబట్టే కదా... మళ్ళీ మళ్ళీ తీశారు. దాన్ని కాపీ అంటే ఎలా? ఎన్ని సార్లు తీసినా జనాలు చూస్తూనే ఉన్నారు. మనను ఇంప్రెస్ చేసిన కథ. జనాల్ని ఇంప్రెస్ చేస్తుందనుకుంటే తప్పకుంటే అదే కంటెంట్ కొద్ది మార్పులతో మళ్ళీ తీస్తూనే ఉన్నారు.  ఏదేమైనా కూడా ‘భజ్రంగీ భైజాన్’ చిత్రం బాలీవుడ్ లో రికార్డుల మోత మ్రోగిస్తుంది. సల్మాన్ సినిమాలో వుండే భారీ యాక్షన్, డాన్సులు వంటివి ఈ సినిమాలో లేకపోయినప్పటికీ. కథలో ప్రాణం ఉంది... నటులు తమ నటనలో జీవించారు కాబట్టే ఈ సినిమా అంత బాగా ఆడుతోంది.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ