హిట్ అనే పదానికి చాలా కాలం దూరమైన ప్రేక్షకుల నుంచి ఏ మాత్రం క్రేజ్ తగ్గని హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. అన్ని కుదిరి ఈ యేడు టెంపర్ తో ఓ సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ జోష్ లోనే సుకుమార్ తో సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. సాధారణంగా హీరోలను స్టైలిష్ గా చూపించే సుక్కు ఈ దఫా ఎన్టీఆర్ ను కనివినీ ఎరుగని రీతిలో చూపేందుకు సిద్ధమైపోతున్నాడు. గడ్డం, క్రాఫ్, డ్రెస్సింగ్ ఇలా ప్రతీ దాంట్లో శ్రద్ధ తీసుకుని బుడ్డోడిని ఓ కొత్త యాంగిల్ లో చూపేందుకు సిద్ధమైపోతున్నాడు. సుక్కు ట్రాక్ ను పట్టించుకోకుండా స్క్రిప్ట్ నచ్చటంతో ఎన్టీఆర్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇంత కాలం ఫ్లాపులతో సతమతమయిన జూనియర్ ఇప్పటి నుంచి ఆచీ తూచీ స్టోరీలను ఎంచుకుంటానని చెప్పేశాడు కూడా. అయితే ఇప్పటివరకూ ఒక మూవీ తర్వాతే రెండో మూవీ గురించి ఆలోచించే ఎన్టీఆర్ రూట్ మార్చాడు.
నాన్నకు ప్రేమతో షూటింగ్ దశలో ఉండగానే, మరో చిత్రానికి ఓకే చెప్పేందుకు సిద్ధమయిపోయాడు. ఇంకోవైపు డైరెక్టర్లు కూడా ఎన్టీఆర్ స్టామినాని పక్కాగా ఉపయోగించుకుని.. బంపర్ హిట్ కొట్టాలని భావిస్తూ కథలతో అప్రోచ్ అవుతున్నారు. కొరటాల శివ ఇప్పటికే ఎన్టీఆర్ కి ఒక స్టోరీ వినిపించాడు. బృందావనం తో ఎన్టీఆర్ రీ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి ఓ లైన్ చెప్పాడట. ఇక యంగ్ డైరక్టర్ గోపీచంద్ మలినేని కూడా మార్పులతో కూడిన కత్తి రీమేక్ కథ కూడా వినిపించాడట. దీనికి దిల్ రాజు నిర్మాత. ఇక రామయ్యా వస్తావయ్యా తో ఎన్టీఆర్ కు డిజాస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ కూడా టైగర్ కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీ రాసి పట్టుకెళ్లాడు. ఇక ఎప్పటినుంచో అదుర్స్ 2 తీయాలని వినాయక్, ఎన్టీఆర్ అనుకుంటున్నారు. ఇది స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఐదింటిలో ఏ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందో... మొత్తానికి దర్శకులంతా కథలతో ఎన్టీఆర్ ను కన్ప్యూజ్ చేసేస్తున్నారన్నమాట.