జాబితాలో ద్రావిడ్ పక్కన బెట్టింది ఎందుకంటే...?

June 02, 2015 | 05:48 PM | 0 Views
ప్రింట్ కామెంట్
bcci_ignores_dravid_niharonline

సమకాలీన క్రికెట్ ప్రపంచంలో భారత్ పేరు చెబితే వినిపించే పేర్లలో మిస్టర్ వాల్ రాహుల్ ద్రవిడ్ పేరు తప్పనిసరిగా ఉండి తీరుతుందనటంలో సందేహం లేదు. అటువంటిది, ఇటీవల బీసీసీఐ తీసుకున్న ఓ నిర్ణయం భారత క్రికెట్ అభిమానులను షాక్ కి గురిచేసింది. సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లతో కూడిన క్రికెట్ సలహా మండలిని నియమించిన సంగతి తెలిసిందే. అయితే అందులో ద్రవిడ్ పేరు లేకపోవటం సర్వత్రా చర్చనీయాంశమైంది. జట్టు కెప్టెన్ గా పనిచేయటంతోపాటు, సహనశీలిగా, అనుభవజ్నుడిగా, పనిచేసిన ద్రవిడ్ ను బోర్డు విస్మరించిందని విమర్శలూ వెల్లువెత్తాయి. తొలుత లక్ష్మణ్ పేరు స్థానంలో ద్రవిడ్ ను అనుకున్నప్పటికీ, గంగూలీ తో కలిసి పనిచేయటం ఇష్టం లేకనే తన పేరు వద్దని ద్రవిడ్ వెల్లడించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఆయన్ను కోచ్ పదవికి ఎంపిక చేసే అవకాశాలు ఉన్నందునే సలహా కమిటీలో తీసుకోలేదన్న వార్తలూ వచ్చాయి. వీటిల్లో ఏది నిజమో మరి కాలమే సమాధానం చెప్పాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ