ప్చ్... రోహిత్ సేన రాత మారలేదు

April 24, 2015 | 11:32 AM | 87 Views
ప్రింట్ కామెంట్
delhi_devils_imran_tahir_turns_mumbai_indians_niharonline

రోహిత్ సేన తలరాత మారలేదు. ముంబై ఇండియన్స్ మళ్లీ చిత్తుగా ఓడింది. గురువారం రాత్రి ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచ్ లో చిత్తుగా ఓటమిపాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఢిల్లీ ఓపెనర్ శ్రేయాస్ అయ్యర్ (83), ఆల్ రౌండర్ డుమ్ని (78) వీరబాదుడుతో ఈ స్కోర్ సాధించగలిగింది. ఇక బ్యాటింగ్ ఆరంభించిన ముంబై తొలుత ధాటిగానే ఆడింది. ఓ దశలో ముంబై విజయం ఖాయంగా కనిపించింది. అయితే ఇమ్రాన్ తెహ్రీ స్పిన్ మాయాజాలంతో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. రోహిత్ శర్మ(30), రాయుడు(30) లను వరుసగా పెవిలియన్ పంపటంతో  ముంబై కష్టాలు మొదలయ్యాయి. వరుసబెట్టి ఆరుగురు బ్యాట్స్ మెన్ క్యూ కట్టడంతో కేవలం 154 పరుగుల వద్ద ముంబై ఆలౌటైంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ