కింగ్స్ లెవెన్ పై రైజర్స్ విక్టరీ

April 28, 2015 | 10:53 AM | 49 Views
ప్రింట్ కామెంట్
SRH_victory_on_punjab_in_mohali_niharonline

ఎట్టకేలకు సన్ రైజర్స్ మెరుగైన ప్రదర్శనతో విజయం సాధించింది. ఐపీఎల్-8లో భాగంగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ 20 పరుగులతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ పై గెలుపొందింది. 151 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు 130 పరుగులే చేసింది. డేవిడ్ వార్నర్ (58), హెన్రిక్స్ (30), నమన్ ఓజా(28) రాణించటంతో హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ ఆరంభంలోనే ధావన్ వికెట్ కోల్పోయింది. దీంతో కెప్టెన్ వార్నర్ బ్యాట్ ఝుళిపించాడు. 41 బంతుల్లో 58 పరుగులు చేశాడు. హనుమ విహారీ (9) రాణించటంతో విఫలమవటంతో క్రీజులోకి వచ్చిన హెన్రిక్స్ నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాడు. అతనికి ఓజా సహకారమందించటంతో మంచి స్కోరును సాధించింది.  ఈ టోర్నీలో హైదరాబాద్ ఇప్పటివరకు 7 మ్యాచ్ లాడి 3 విజయాలు సాధించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ