బెంగళూరు దెబ్బ, రాజస్థాన్ అబ్బా...

April 25, 2015 | 11:06 AM | 54 Views
ప్రింట్ కామెంట్
kohli_devilliers_on_rajasthan_royals_niharonline

ఐపీఎల్-8 లో భాగంగా అహ్మదాబాద్ లో శుక్రవారం రాత్రి జరిగిన టీ-20 మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుస వైఫల్యాలకు చెక్ చెప్పుకుంది. కెప్టెన్ కోహ్లీతోపాటు విధ్వంసక బ్యాట్స్ మెన్ డివిలియర్స్ రాణించటంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. తొలుత బౌలర్లు రాణించటంతో కేవలం 130 పరుగులకే పరిమితమైన రాజస్థాన్ జట్టు ఆపై ఫీలింగ్ లోనూ చేతులెత్తేసింది. ఇక బెంగళూరు జట్టులో ఓపెనర్ క్రిస్ గేల్ (20) తక్కువ పరుగులకే అవుటయినప్పటికీ, కెప్టెన్ కోహ్లీ(62), డివిలియర్స్ (47) చెలరేగిపోవటంతో 16.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి జట్టుకు విజయాన్ని అందించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ