ఆల్ రౌండర్ షో తో అదరగొట్టిన చెన్నై... చాలెంజర్స్ చిత్తు

April 23, 2015 | 11:12 AM | 54 Views
ప్రింట్ కామెంట్
suresh_raina_on_bengalore_niharonline

బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ జట్టు హ్యాట్రిక్ సాధించింది. విజయాల్లో కాదులేండి... అపజయాల్లో. ఐపీఎల్ 8 లో వరుస పరాజయాలతో సతమతమవుతుతన్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా నేతృత్వంలోని ఈ జట్టు బుధవారం చెన్నై చేతిలో చావుదెబ్బతింది. అటు బ్యాటింగ్ లోనే కాదు... ఇటు బౌలింగ్ లో కూడా చెన్నై సత్తా చాటి బెంగళూర్ ను చిత్తుచిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు చేసింది. మెక్ కల్లమ్ (4) నిరాశపరిచిన రైనా(62), డ్వేన్ స్మిత్ (39), డుప్లెసిస్ (33) రాణించటంతో 181 పరుగుల స్కోర్ సాధించగలిగింది. ఓ దశలో భారీ స్కోర్ సాధించే దిశగా కనిపించినప్పటికీ చివర్లో టపటపా వికెట్లు రాలాయి. ఇక 182 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూర్ కెప్టెన్ కోహ్లీ(51) ఒంటరి పోరాటం చేసినప్పటికీ కేవలం 154 పరుగులకే ప్యాక్ అయింది. ఇక చెన్నై సీనియర్ బౌలర్ ఆశిశ్ నెహ్రా మరోసారి రాణించాడు. కేవలం 2.5 ఓవర్లలోనే 10 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసి, బెంగళూర్ నడ్డి విరిచాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ