జాగ్రత్త ధోనీ... రాబోయేది వరల్డ్ కప్

January 31, 2015 | 10:55 AM | 107 Views
ప్రింట్ కామెంట్

ముక్కోణపు సిరీస్ లో టీమిండియా వైఫల్యం పై మాజీ క్రీడాకారుడు గవాస్కర్ ధోనీపై ఫైరయ్యాడు. ధోనీ ప్రణాళికలు నాసిరకంగా ఉన్నాయని అభిప్రాయపడిన ఆయన, రానున్నది ప్రపంచకప్ అని మరిచిపోయినట్టున్నారని సెటైర్లు వేశారు. అల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ తన బౌలింగ్ తో ఆకట్టుకున్నప్పటికీ ధోనీ అతన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడని విమర్శించాడు. ఎనిమిది ఓవర్లలో మూడు వికెట్లు తీసిన ఆటగాడి కోటాను ధోనీ పూర్తి చేయనివ్వలేదని గవాస్కర్ వెల్లడించాడు. టీమిండియా విఫలం కావటం తీవ్రంగా కలిచివేసిందని చెప్పాడు. వరల్డ్ కప్ అన్న విషయాన్ని గుర్తుంచుకొని ఇకపై ధోనీ జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొన్నడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ