స్టోరీ: బహుశా వీరికిదే ఆఖరు కాబోలు

January 27, 2015 | 05:37 PM | 108 Views
ప్రింట్ కామెంట్

మరి కొన్ని రోజుల్లో వరల్డ్ కప్ సమరం ప్రారంభం కాబోతుంది. ఉపఖండంపై ధోనీ సేన కప్ ఎత్తిన వేళ ను కళ్ల ముందు కదలాడుతున్న క్షణాలు ఇంకా మరిచిపోకముందే మళ్లీ మన ముందుకు వచ్చేసింది. కోట్లాది మంది ప్రజలు ఈ మహా సంగ్రామం కోసం ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. కంగారు, కివీ పిచ్ లకు సంయుక్తంగా వేదిక కాబోతున్న ఈ క్రికెట్ పండుగలో ఎన్నో ప్రాముఖ్యతలు సంతరించుకోబోతున్నాయో, ఎన్ని రికార్డులు క్రియేట్ కాబోతున్నాయో అని అభిమానులు ఆశగా చూడటం మాములే. అయితే కొంత మంది ఆటగాళ్లకు ఈ టోర్నీ లైఫ్ ఇస్తే, మరికొంత మందికి బహుశా ఇదే ఆఖరు అన్న విషయం వారి అభిమానులకు కాస్త చేదుగానే ఉంటుంది. ఆ జాబితాలో ఉన్నవారి లిస్ట్ ఇప్పుడు చూద్దాం... ఇందులో మొదటగా చెప్పుకోదగింది భారత వన్డే జట్టు కెప్టెన్ ధోనీయే. కొన్ని అనివార్య పరిస్థితుల మధ్య హఠాత్తుగా ఇటీవల టెస్ట్ ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీకి బహుశా ఇదే ఆఖరు వరల్డ్ కప్ అనుకోవటంలో అతిశయోక్తి లేదు. మొత్తం 253 వన్డేలాడిన ధోనీ భారత్ ను అన్ని ఫార్మాట్ లలో టాప్ ర్యాంకులో నిలబెట్టడంతోపాటు వరల్డ్ కప్ తోపాటు 20-20 వరల్డ్ కప్ ను కూడా సాధించిపెట్టాడు. ఇక ఈసారి కూడా కప్ పై కన్నేసి తన జట్టుకు విజయాన్ని అందించి నిష్క్రమిద్ధామన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ వరల్డ్ కప్ నుంచి అర్థాంతరంగా నిష్క్రమించే పరిస్థితి వస్తే మాత్రం తక్షణమే తన రిటైర్మెంట్ ను ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఇదే జాబితాలో ఆస్ట్రేలియన్ కీ ప్లేయర్ మైకేల్ క్లార్క్, న్యూజిలాండ్ ఎడమచేతి ఆల్ రౌండర్ డెనియల్ వెటోరీ, శ్రీలంక ప్లేయర్లు తిలకరత్నే దిల్షాన్, కుమార సంగక్కర, మహేలా జయవర్థనే, లసిత్ మలింగ, పాకిస్థాన్ సీనియర్ ఆటగాళ్లు షాహిద్ అఫ్రిదీ, యూనిస్ ఖాన్, మిస్బా ఉల్ హక్ ఈ జాబితాలో ఉన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ