ఫీలైన సరే ఈసారి డీఆర్ఎస్ అమలుచేస్తారట

January 29, 2015 | 12:06 PM | 107 Views
ప్రింట్ కామెంట్

త్వరలో ప్రారంభం కానున్న వరల్డ్ కప్ లో డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) ను అమలుచేసేందుకు ఐసీసీ నిర్ణయించింది. దుబాయ్ లో జరిగిన ఐసీసీ సమావేశంలో దీనిపై చర్చించారు. మొత్తం 49 మ్యాచ్ లలోనూ డీఆర్ఎస్ అమలు చేయాలని నిర్ణయించారు. కాగా, డీఆర్ఎస్ ను తొలిసారి 2009లో న్యూజిలాండ్-పాకిస్థాన్ టెస్ట్ సిరీస్ లో ప్రవేశపెట్టారు. అయితే, ఈ విధానంలో ఖచ్చితత్వం లేదంటూ బీసీసీఐ తమ సిరీస్ లలో డీఆర్ఎస్ అమలును ఇప్పటిదాకా వ్యతిరేకిస్తూ వచ్చింది. ఐసీసీ తాజా నిర్ణయం బీసీసీఐని ఇబ్బంది పెట్టేదే. గతంలో 2011 వరల్డ్ కప్ లో ఇంగ్లాడ్ ఆటగాడు ఇయాన్ బెల్ విషయంలో డీఆర్ఎస్ అమలు చేయడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అప్పుడు దానిని బీసీసీఐ తీవ్రంగా వ్యతిరేకించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ