క్రికెట్ దేవుడు సచిన్ తన ఫేవరెట్ ఆటగాడని కరేబియన్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ అంటున్నాడు. ఆకారంగా భారీగా కనిపించకపోయినా, అంత చిన్న ప్యాకేజీలో అన్ని సంగతులు కనిపిస్తాయని సచిన్ ఆటతీరును ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే అతడో లెజెండ్ అని పేర్కొన్నాడు. ఏదైనా డ్రీమ్ టీంను సచిన్ లేకుండా ఎంపిక చేస్తే అంతకంటే సిగ్గుచేటు ఉండబోదని ఆయన పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కి రాసిన కాలమ్ లో రిచర్డ్స్ ఈ విషయాలను స్పష్టం చేశాడు. వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం... బరిలో దిగేడంటే ప్రత్యర్థులకు వణుకే. మరి అటువంటి క్రికెటర్ కు సచిన్ టెండూల్కర్ ఆటంటే చాలా ఇష్టంకావటం, దానిని తనే స్వయంగా ఒప్పుకోవటం నిజంగా గ్రేట్ కదా... అన్నట్టు ఆల్ టైం వన్డే 10 మంది క్రికెటర్లలో రిచర్డ్స్ స్థానాన్ని సచిన్ అధిగమించాడు. దీనిపై స్పందించిన రిచర్డ్స్.. 'నాకు సచిన్ ఫేవరెట్. ఒక్క మాటలో చెప్పాలంటే అతని మ్యాచ్ లను డబ్బులు చెల్లించి మరీ చూసేవాడినన్నాడు. కాగా, ప్రస్తుత వరల్డ్ కప్ లో సచిన్ లేకపోవటం ఓకింత బాధాకరమైన విషయమేనని ఆయన అన్నారు. అయినప్పటికీ టీం ఇండియాకు ఆల్ ది బెస్ట్ అని చెప్పారు.