స్మార్ట్ ఫోన్లలో ఫోటోలను ముద్రించుకునేందుకు వీలుగా ఉండే వినూత్న పరికరం త్వరలో మార్కెట్లోకి రానుంది. సెల్ఫీలను, ఫోటోలను అప్పటికప్పుడే ముద్రించుకునేందుకు ఉపయోగపడే స్మార్ట్ కేస్(పౌచ్)ను ఫ్రెంచ్ కంపెనీ ‘ప్రింట్’ తయారు చేసింది. అంతర్గతంగా ప్రింటర్‌తో ఉండే ఈ స్మార్ట్ ఫోన్ కేస్ బ్లూటూత్ ద్వారా ఫోన్‌కు అనుసంధానమై ఉంటుంది. ఎంపిక చేసుకున్న ఫొటోలను కేవలం 50 సెకన్లలోనే ప్రింట్ చేస్తుంది. ప్రస్తుతం 4 ఇంచులు ఉండే స్మార్ట్ ఫోన్ల కోసమే తయారు చేసిన ఈ కేస్ ప్రింటర్‌లో ఒకసారి ఒక కాగితం మాత్రమే పెట్టేందుకు వీలవుతుంది. మరిన్ని స్మార్ట్ ఫోన్ మోడళ్లకు కోసం దీనిని రూపొందిస్తున్నామని, అంతేగాక ఒకేసారి 30 కాగితాలు పట్టేలా, 30 సెకన్లలోనే ఒక ఫొటోను ప్రింట్ చేసేలా దీనిని అభివృద్ధిపరుస్తున్నట్లు కంపెనీ సీఈవో క్లెమెంట్ ప్రకటించాడు. వచ్చే జనవరిలో దీని విడుదల చేస్తున్నట్లు తెలిపాడు. కంపెనీ దీని ధరను 99డాలర్లుగా (సుమారు రూ. 6,000) నిర్ణయించారు.