ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్ మెసెంజర్ యాప్ ను వాడే వారి సంఖ్య 50కోట్లకు చేరిందని ఆ సంస్థ ప్రకటించింది. విడుదల చేసిన మొదట్లో ఈ యాప్ పట్ల ప్రజలు అంతగా ఆసక్తి కనబరచలేదు. గతేడాది ఏప్రిల్ లో ఈ యాప్ ను వాడిన వారి సంఖ్య 20కోట్లు మాత్రమే ఉండగా, ఇప్పుడది 50కోట్లకు చేరింది. సందేశాలను పంపే విధానాన్ని సులభతరం చేసేందుకు తాము విడుదల చేసిన ఏకైక యాప్ ఇదేనని, దీనికి క్రమక్రమంగా ఆదరణ పెరుగుతూ వస్తోందని ఫేస్ బుక్ ప్రతినిధి పీటర్ మార్టినజ్జి తన బ్లాగులో పేర్కొన్నాడు. ప్రజల్లో ఈ యాప్ పట్ల విశ్వసనీయతను పెంచేందుకు క్రుషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ యాప్ పట్ల ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ ఈ యేడాది జనవరిలో చేసిన ప్రకటన అనంతరమే దీని వాడకదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోందని పేర్కొన్నాడు.