నిన్ను రేపా? నీకంత సీన్ లేదోయ్

December 20, 2014 | 01:38 PM | 180 Views
ప్రింట్ కామెంట్

బ్రెజిల్ లో ఓ నేత పార్లమెంట్ సాక్షిగా తోటి సభ్యురాలిపై నోరు జారి అడ్డంగా బుక్కయ్యాడు. జీర్ బోల్సోనారో... బ్రెజిల్ పార్లమెంట్ లో విపక్ష సభ్యుడు. ఒక చర్చలో భాగంగా మహిళా సభ్యురాలిని ఉద్దేశించి "నీపై నేను అత్యాచారం చేయను. ఎందుకంటే, నీకంత విలువ లేదు. నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావు" అన్నాడు. బోల్సోనారో వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయ మానవ హక్కులపై చర్చ జరుగుతున్న సమయంలో మారియా డో రోసారియోను ఉద్దేశించి "ఇక్కడే ఉండు మారియా... నేను నిన్ను మానభంగం చేయను" అన్నాడు. బోల్సోనారో వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. బోల్సోనారోపై మారియా కేసు పెట్టగా, తన మాటలకు కట్టుబడి ఉంటానని బోల్సోనారో చెబుతున్నారు. కాగా, సంప్రదాయ పురుషాధిక్య సమాజం ఉన్న బ్రెజిల్ లో రోజుకు సగటున 137 లైంగిక వేధింపుల కేసులు నమోదవుతుంటాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ