అమ్మపై పదేళ్ల నిషేధం

November 13, 2014 | 11:17 AM | 186 Views
ప్రింట్ కామెంట్

తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై ఎన్నికల్లో పోటీచేయకుండా పదేళ్లపాటు అనర్హత వేటు పడింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ తమిళనాడు ప్రభుత్వం ప్రచురించింది. ఆదాయంకు మించిన ఆస్తుల కేసులో 18 ఏళ్లుగా కొనసాగిన విచారణ అనంతరం ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం సెప్టెంబర్ 27న ఆమెను దోషిగా పేర్కొంది. ఈ మేరకు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం నోటిఫికేషన్ ను స్పీకర్ ధన్ పాల్ విడుదల చేశారు. తీర్పు వెలువడిన తేదీ నుంచే ఆమెపై వేసిన అనర్హత వేటు అమలులోకి వచ్చినట్లు నోటిఫికేషన్ లో ప్రభుత్వం పేర్కొంది. జైలు శిక్ష పడినందున ఆమె ప్రాతినిధ్యం వహించిన శ్రీరంగం అసెంబ్లీ నియోజకవర్గం అదే తేదీ నుంచి ఖాళీగా ఉన్నట్లు తెలిపింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ