రష్యా ప్రధానితో మోదీ భేటీ

November 13, 2014 | 03:26 PM | 154 Views
ప్రింట్ కామెంట్

విదేశీ పర్యటనలో భాగంగా మయన్మార్ లో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రష్యా ప్రధాని దిమిత్రి మెద్వెదేవ్ తో భేటీ అయ్యారు. ఆసియన్, తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులలో భాగంగా అక్కడున్న వీరు ఇరుదేశాల సంబంధాలు బలపడేందుకు అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు. చర్చలనంతరం భారత్ రష్యాల మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయని భావిస్తున్నట్లు మోదీ ప్రకటించారు. భారత్ మాకు సన్నిహితమైన, విలువైన భాగస్వామ్య దేశమని మెద్వెదేవ్ ఒక సందేశంలో పేర్కొన్నాడు. వచ్చే నెల ఢిల్లీలో నిర్వహించబోయే ఇండో-రష్యన్ 15వ సదస్సులో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పరస్పరం చర్చించాల్సిన అంశాలపై మోదీ మెద్వెదేవ్ లు మంతనాలు చేసినట్లు సమాచారం. బ్రెజిల్ లో ఈ జూలైలో జరిగిన బ్రిక్స్ సమావేశాల సందర్భంగా పుతిన్ తో సమావేశమైన మోదీ అణు రక్షణ ఒప్పందాల గురించి చర్చించారు. ఇరుదేశాల సదస్సు పర్యటనలో భాగంగా కూడంకుళం అణు విద్యుత్ కేంద్రాన్ని సందర్శించాల్సిందిగా మోదీ పుతిన్ ను ఆహ్వానించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ