అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం తాజా వన్డే ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. ఇందులో టాప్-5 లో భారత్ కు చెందిన ఇద్దరు చోటు సంపాదించుకున్నారు. జాబితాలో యువ కెరటం విరాట్ కోహ్లీ 3వ ర్యాంక్ లో నిలువగా, శ్రీలంక సిరీస్ లో అద్భుతంగా రాణిస్తున్న డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఐదో స్థానానికి ఎగబాకాడు. మరోవైపు గాయం కారణంగా ప్రస్తుత సిరీస్ కు దూరమైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక స్థానం కోల్పోయి 7వ ర్యాంక్ తో సరిపెట్టకున్నాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ లు డివిలియర్స్, ఆమ్లాలు వరుస మొదటి, రెండు స్థానాలలో కొనసాగుతున్నారు. ఇక బౌలర్ల జాబితాలో భారత పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, పాకిస్థాన్ బౌలర్ హఫీజ్ తో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.