ఢిల్లీలో మోదీ ఎన్నికల ర్యాలీ... భారీ భద్రత

January 31, 2015 | 12:37 PM | 73 Views
ప్రింట్ కామెంట్

త్వరలో ఢిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ శనివారం ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ అంతటా భారీ భద్రతను ఏర్పాటుచేశారు. మొత్తం నాలుగు ప్రచార ర్యాలీల్లో పాల్గొంటారు. ప్రధానంగా ప్రచారసభ జరిగే సీబీడీ గ్రౌండ్స్ లో ఎస్పీజీ, ఢిల్లీ పోలీసులు విస్త్రుత ఏర్పాట్లు చేశారు. ఇక వేదిక నుంచి మూడంచెల చెక్ పాయింట్లను ఏర్పాటుచేసినట్లు ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ర్యాలీకి వచ్చే వారందరినీ గ్రౌండ్ కు 50 మీటర్ల దూరంలోనే చెక్ చేస్తామని ఆయన చెప్పారు. అంతేకాదు వెంట తీసుకొచ్చే బ్యాగ్ లను స్కాన్ మెషిన్లతో తనిఖీ చేస్తామని వెల్లడించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ