హస్తినను అభివృద్ధి పంథాలో నడిపించటమే నా లక్ష్యం

February 02, 2015 | 11:44 AM | 86 Views
ప్రింట్ కామెంట్

ఢిల్లీలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరిచి అభివృద్ధి పంథాలో నడిపించటమే తన ముందున్న ఏకైక లక్ష్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ద్వారకాలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం నడపడమనేది ఎంతో బాధ్యతతో కూడుకున్నదని.. బాధ్యతలనుంచి పారిపోవడం దానికి సమాధానం కాదని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలని మోదీ కోరారు. సామాన్యుల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడమే ప్రభుత్వ బాధ్యతన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపుపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఆయన తనదైన స్టయిల్లో కౌంటర్ ఇచ్చారు. మోదీ అదృష్టంవల్లే పెట్రోల్‌ డీజిల్‌ ధరలు తగ్గాయని వారంటున్నారు. అలాంటప్పుడు దురదృష్టవంతుడిని ఎన్నుకోవలసిన అవసరం ఏముందని చమత్కరించారు. ఇప్పుడు చెప్పండి మీకు అదృష్టవంతుడు కావాలా? లేక దురదృష్టవంతుడు కావాలా? అని ప్రజలనుద్ధేశించి ప్రశ్నించారు. నేను అదృష్టవంతుడినే అనుకోండి... కానీ మీకు డబ్బులు మిగిలాయి కదా.. మోదీ అదృష్టం దేశ ప్రజలకు ఉపయోగపడితే అంతకన్నా ఇంకేంముంటుంది’’ అని ఆయన అన్నారు. ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీలు పోటీ పడి తప్పుడు హామీలు ఇస్తున్నాయని మోదీ విమర్శించారు. ఢిల్లీ అంటే మినీ భారతమని అందుకే ఢిల్లీ బాగోగులను కేంద్రం కూడా చూస్తుందని అన్నారు. కాగా, ఆదివారం ఒక్కరోజే ఏకంగా 100మందికి పైగా టాప్‌ కంపెనీల సీఈవోలు బీజేపీలో చేరారు. పార్టీ అధినేత అమిత్‌షా, బీజే వైఎం అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ