సర్ ప్రైజ్ గిఫ్ట్ లతో ఒబామాను సాగనంపాడు

January 27, 2015 | 05:53 PM | 146 Views
ప్రింట్ కామెంట్

భారత పర్యటనకు వచ్చిన ఒబామా ఎనలేని గుర్తులతోపాటు బహుమతులను ప్రధాని మోదీ అందజేశాడు. ఈ విషయాలను స్వయంగా మోదీయే సోషల్ మీడియాలో పేర్కొనటం విశేషం. బహుమతుల లిస్ట్ లో 1957లో భారత పర్యటనకు వచ్చిన అమెరికన్ సింగర్ మరియన్ అండర్సన్ ఇక్కడ పాడిన గీతాల రికార్డులను మోదీ స్వయంగా ఒబామాకు అందించారు. ఆ సమయంలో ఆకాశవాణిలో ప్రసారం అయిన అండర్సన్ ఇంటర్వ్యూ, గాంధీ స్మారకార్థం ఆయన పాడిన లీడ్ కైండ్లీ లైట్ గీతం రికార్డును కూడా బహుమతిగా ఇచ్చారు. అమెరికా నుంచి తొలిసారి ఇండియాకు వచ్చిన టెలిగ్రాం ఒరిజినల్ కాపీ ఆయనకు అందించాడట. వీటితోపాటు 1950 జనవరి 26న విడుదలైన స్టాంప్, విలువైన చీరలు, పలు బహుమతులు ఒబామా తన వెంట తీసుకెళ్లినట్టు మోదీ తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ