మన జాతి బలం అదే

January 28, 2015 | 05:14 PM | 105 Views
ప్రింట్ కామెంట్

భిన్నత్వంలో ఏకత్వం అదే మన జాతి ప్రధాన బలమని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మనదేశం వైవిధ్యాలయం. మన దేశ బలం, సౌందర్యం భిన్నత్వంలో ఏకత్వమే అని ఢిల్లీలో ఓ ఎన్సీసీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఆ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కనిపించిన బాలికా క్యాడెట్లను చూసి సంతోషానికి లోనయ్యారు. ఇక, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, రక్షణ శాఖ సహాయమంత్రి ఇంద్రజిత్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మాస్వరాజ్, బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ, నటి,ఎంపీ జయాబచ్చన్... వీరందరూ ఎన్సీసీ కేడేట్లేనని మోదీ వెల్లడించారు. తాను కూడా ఎన్సీసీ కేడెట్ నే అని, అయితే ఢిల్లీలో పెరేడ్ కు ఎప్పుడూ ఎంపిక కాలేదని తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ