27న ఒబామా-మోదీల ‘మన్ కీ బాత్’

January 21, 2015 | 02:34 PM | 118 Views
ప్రింట్ కామెంట్

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా అక్కడి అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి వాషింగ్టన్ పోస్ట్ లో ఎడిట్ కాలమ్ రాసిన సంగతి విదితమే. ఇప్పడు ఇదే సంప్రదాయాన్ని కొనసాగించే క్రమంలో మరో అడుగు ముందుకు పడింది. త్వరలో ఒబామా భారత్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా తన రేడియో ప్రోగ్రాం మన్ కీ బాత్ ను నిర్వహించాలని మోదీ భావించారట. మోదీ ప్రతిపాదనకు ఒబామా సైతం అంగీకారం తెలిపారంట. ఈ నెల 25న భారత్ కు రానున్న ఒబామా గణతంత్ర వేడుకల్లో పాల్గొంటారు. అలాగే 27న వీరిద్దరూ సంయుక్తంగా రేడియో ప్రసంగం చేయనున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ