అప్పుడేమో కుదరదని... ఇప్పుడిలా చేస్తారా

January 27, 2015 | 04:08 PM | 196 Views
ప్రింట్ కామెంట్

అమెరికాతో భారత అణు ఒప్పందానికి సంబంధించి మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ విమర్శలు ఎక్కుపెట్టారు. తమ ప్రభుత్వ(యూపీఏ) హయాంలో ప్రతిపాదించిన అణుబిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ నేతలు, నేడు అవే అంశాలతో కూడిన ఒప్పందానికి మొగ్గుచూపారని ఆయన అన్నారు. ఈ విషయంలో మోదీ సర్కార్ యూటర్న్ తీసుకుందని డిగ్గీరాజా ధ్వజమెత్తారు. ఆనాడు వారి అభ్యంతరాల నేపథ్యంలో బిల్లుకు మార్పులు చేసినా, బీజేపీ శాంతించలేదని, కానీ నేడు మాత్రం అవే అంశాలతో కూడిన బిల్లుతో అమెరికాతో అణు ఒప్పందం చేసుకుంటుందని ఆయన అన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ