దేశ రాజధాని ఢిల్లీకి శక్తివంతమైన పరిపాలన అవసరమని బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ పునరుద్ఘాటించారు. ఢిల్లీలోని 70 నియోజక వర్గాలలో ప్రజలకు సేవ చేసేందుకు తన 40 ఏళ్ల అనుభవాన్ని అంకితం చేసేందుకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. తద్వారా ప్రధాని మోదీ పై ఉన్న బాధ్యతలను తగ్గించేందుకు క్రుషిచేస్తానని ఆమె పేర్కొన్నారు. నా నలభై ఏళ్ల కార్యనిర్శహణ, ప్రజా సేవ అనుభవంతో ఢిల్లీకి సేవ చేస్తాను. ఢిల్లీకి బలమైన ప్రభుత్వం అవసరం. ఓ దీర్ఘకాల ఢిల్లీ నివాసిగా నగరానికి మనం రుణపడి ఉన్నామని గట్టిగా నమ్ముతున్నా, తప్పకుండా సమర్థవంతమైన, మంచి ప్రభుత్వాన్ని మా జట్టు(బీజేపీ) ఇవ్వగలదు అని ట్విట్టర్ లో బేడీ ట్విట్ చేశారు. కేజ్రీవాల్ రెవెన్యూ డిపార్ట్ మెంట్లో ఐదేళ్లు పనిచేస్తే, తాను 40 ఏళ్లు ప్రజలకు దగ్గరగా ఉండే సర్వీస్ (పోలీస్) లో ఉన్నానని, కాబట్టి ప్రజా సమస్యలు ఆయన కంటే తనకే బాగా తెలుసునని ఆమె పేర్కొంది.