ఆప్ అధినేతపై కాలు దువ్వుతున్న తెలుగోడు

January 24, 2015 | 11:17 AM | 240 Views
ప్రింట్ కామెంట్

ఢిల్లీ అసెంబ్లీ పోరులో ఓ ఆసక్తికరమైన అంశం చోటుచేసుకోబోతుంది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై ఓ తెలుగు వ్యక్తి పోటీచేయబోతున్నాడు. నెల్లూరుజిల్లా వెంకటాచలం మండలంకు చెందిన కొండూరు సునీల్ కుమార్ అనే వ్యక్తి బరిలో దిగుతున్నాడు. కేజ్రీవాల్ పోటీచేయబోతున్న న్యూఢిల్లీ నుంచి గురువారం సాయంత్రం అతను స్వతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. ఈసీ కూడా అతని నామినేషన్ పత్రాలను ఓకే చేసినట్లు సమాచారం. నియోజక వర్గంలో ప్రజల సమస్యలను అధికారులు, ప్రభుత్వం గాలికి వదిలేశారని ఈ సందర్భంగా సునీల్ ఆరోపించాడు. తనకు ఓటేసి గెలిపిస్తే అభివ్రుధ్ది దిశగా నడిపిస్తానని అతను హామీనిస్తున్నాడు. మరీ ఢిల్లీవాసులు మన తెలుగోడి గోడును పట్టించుకుంటారంటారా?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ