మోత్కుపల్లి... రాజయ్య పై వేటు అందుకేనంటావా?

January 27, 2015 | 03:31 PM | 180 Views
ప్రింట్ కామెంట్

టి.రాజయ్య భర్తరఫ్ ను ఇప్పుడు ప్రతిపక్షాలు పావుగా వాడుకుని ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ ఈ అంశంలో ముందుగా నిలుచుంది. కేసీఆర్ కు తెలియకుండా హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటుపై ప్రకటన చేసినందుకే టి.రాజయ్యపై వేటు వేశారని తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. రాజయ్యను భర్తరఫ్ చేయటం ద్వారా దళితుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కించపరిచారని ఆయన విమర్శించారు. ఓ వైపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి మంచి పనితీరును కనబరిచారంటూ కీర్తిస్తూనే మరో వైపు హఠాత్తుగా రాజయ్యను భర్తరఫ్ చేశారని, దీనివెనుక ఉన్న కారణాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దళితులకు అసలు కేబినెట్ లో సముచిత స్థానం కల్పించలేదని దుయ్యబట్టారు. ఓ వైపు స్వైన్ ఫ్లూ పై కేంద్రం అలర్ట్ చేసినా సరే నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడంతో మరణాలు సంభవించాయని, దీంతో ఆగ్రహాం వ్యక్తంచేసిన సీఎం, సన్నిహితుడని చూడకుండా మరీ వేటు వేశాడని సీఎం సన్నిహితులు చెబుతున్నారు. మరి వీటిలో ఏది నిజమో ఎవరికి తెలుసు?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ