జీవితకు రెండేళ్ల జైలు శిక్ష

November 24, 2014 | 03:04 PM | 31 Views
ప్రింట్ కామెంట్

చెక్ బౌన్స్ కేసులో సినీ నటి, దర్శకురాలు జీవితారాజశేఖర్ కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. నటుడు డాక్టర్ రాజశేఖర్ భార్య అయిన జీవితకు రెండేళ్ల శిక్షతోపాటు రూ.25 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఎర్రమంజిల్ కోర్టు తీర్పు వెలువరించింది. ‘ఎవడైతే నాకేంటి’ సినిమాకి సంబంధించి నిర్మాత శేఖర్ రెడ్డికి జీవిత 22 లక్షల చెక్ ఇచ్చారు. ఆ చెక్ బౌన్స్ అయింది. ఈ విషయాన్ని శేఖర్ రెడ్డి జీవిత దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ ఆమె పట్టించుకోలేదు. దాంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విషయంలో జీవితకి గతంలో నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ కూడా జారీ అయింది. కేసు విచారించిన ఎర్రమంజిల్ కోర్టు జీవితకు శిక్షతోపాటు జరిమానాను కూడా విధించింది. ఇదిలా వుంటే జీవితా రాజశేఖర్ మీద మరో 36 లక్షల రూపాయల చెల్లని చెక్కు కేసు కూడా ఉన్నట్లు సమాచారం.ఆమె ఇటీవలె బీజేపీలో కూడా చేరారు. ప్రస్తుతం ఆమె తెలంగాణలో ఆపార్టీ తరపున అధికార ప్రతినిధిగా కూడా పనిచేస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ