ఎయిర్ పోర్ట్ టెర్మినల్ పేరు మార్చడం మాటేంటో గానీ తెలంగాణ నేతలు మాటల అస్త్రాలను ఇప్పటికే వరుసగా సంధించుకుంటున్నారు. ఇక ఈ వ్యవహారంలో ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవడంతో అగ్గికి ఆయిల్ పోసినట్లయింది. ఎన్టీఆరే కేసీఆర్ కు రాజకీయ గురువు అలాంటి గురువు గురించి ఇలా మాట్లడటం తెలంగాణ సీఎంకు తగదని అని చంద్రబాబు వ్యాఖ్యానించడంతో దుమారం రేగింది. ఇక సీన్లోకి ఎంటరయిన టీ మంత్రి హరీష్ రావు చంద్రబాబుకు పంచ్ లమీద పంచ్ లేశాడు. ‘కేసీఆర్ కి ఎన్టీఆర్ రాజకీయ గురువయితే మరి చంద్రబాబుకు గురువు ఎవరు?’ అని ప్రశ్నించారు. చంద్రబాబు తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ లోనే కదా. అలాంటప్పుడు అయినకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ గురువు అవుతుందని కౌంటర్ వేసేశాడు. అలాంటి గురువు కొడుకైన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని చంద్రబాబు అవమానించేలా మాట్లాడం ఎంత వరకు సబబని మళ్లీ ఇంకొటి వేసేశాడు. తెలంగాణ అభివృద్ధిని జీర్ణించుకోలేకే ఏపీ సీఎం చంద్రబాబు ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని హరీష్ మండిపడ్డారు.