తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC) ఏర్పాటుతో లక్షలాది మంది నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఇన్నాళ్లు ఊరిస్తూ వచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు త్వరలో రాబోతున్నాయి. అసలు ఉద్యోగాలు వస్తాయా రావా? తెలంగాణా విభజన వల్ల యువత ఏ మేరకు లాభపడగలదన్న డైలమలో ఉన్న నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. వీఆర్వో, వీఆర్ఏ తర్వాత…గతేడాది వీఆర్వో, వీఆర్ఏ మినహాయించి ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ ప్రకటన లేదు. అలాగే 2011 గ్రూప్ -1, గ్రూప్ -2 నోటిఫికేషన్లు తప్స కొత్త నోటిఫికేషన్ లేదు. అవి కూడా సుప్రీం కోర్టు గడప ఎక్కడంతో రద్దయ్యాయి. అప్పటినుంచి ఇప్పటివరకు ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తోంది యువత. అభ్యర్థుల ఆశలకు తగ్గట్టే డిపార్ట్ మెంట్ల వారీగా ఖాళీలను ప్రభుత్వమే ప్రకటించింది. టీఎస్ పీఎస్ సీ చైర్మన్ ఘంటా చక్రపాణి కూడా వచ్చే ఏడాదిని ఉద్యోగ నామ సంవత్సరంగా ప్రకటించడంతో అభ్యర్థులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివిధ శాఖల్లో…ప్రభుత్వ లెక్కల ప్రకారమే లక్షా 7 వేల 744 ఉద్యోగ ఖాళీలున్నాయి. ఇందులో పాఠశాల విద్యాశాఖలో 24 వేల 861, ఉన్నత విద్యాశాఖలో 10 వేల 592, హోంశాఖలో 15 వేల 339, రెవెన్యూ శాఖలో 10 వేల 142, సచివాలయంలో 510 ఖాళీలున్నట్టు అధికార వర్గాలు ప్రకటించాయి. విభాగాల వారిగా ఖాళీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇంకా మరిన్ని ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉంది. ఇక తెలంగాణా కొలువులకు నెలవుగా మారచ్చునేమో!