ఉగ్రవాదులపై మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఐఎస్ తీవ్రవాదులు నరహంతకులుగానే కాక రేపిస్టులని ఆయన అభివర్ణించారు. పవిత్ర ఇస్లాం మతంకు ఐఎస్ ఉగ్రవాదం ప్రధాన శత్రువని ఆయన వ్యాఖ్యానించారు. యువత మతోన్మాదుల ఉపన్యాసాలకు ఆకర్షితులై ఐఎస్ లో చేరి జిహాద్ పేరిట విధ్వంసాలు, రక్తపాతం చేయటం సరికాదని పేర్కొన్నారు. గురువారం ఓల్డ్ సిటీలోని జామియా నిజామియా కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జిహాద్ కు సరైన నిర్వచనం కావాలంటే మత గురువులను సంప్రదించండి. నిజమైన జిహాద్ చేయాలనుకునేవారు ముందుగా తమ వీధుల్లో ఉండే చెడుపై యుద్ధం చేయాలని ఆయన పిలుపునిచ్చాడు.