నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీ లేడీస్ హస్టల్ లోకి కొందరు ఆగంతకులు చోరబడేందుకు ప్రయత్నించటం, ఆపై వారిచేతిలో పిచ్చి తన్నులు తినటం తెలిసిన విషయమే. ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగుచూసింది. వీరిలో ఇద్దరు తెలంగాణ స్పెషల్ పోలీసు విభాగంలో కానిస్టేబుళ్లు కాగా, మరో వ్యక్తి ఓ పోలీస్ అధికారి పుత్రరత్నం అట. సోమవారం సాయంత్రం వీరు ముగ్గురు లేడీస్ హస్టల్లోకి చాటుగా చోరబడేందుకు ప్రయత్నించారు. గమనించిన విద్యార్థినులు వార్డెన్ తో కలిసి తమ చేతులకు పనిచెప్పి వారిని పోలీసులకు అప్పగించారు. విచారణ సందర్భంగా వారు పొంతన లేని సమాచారం చెప్పినట్లు తెలుస్తోంది.