ఐదుసార్లు దొరికినా ఎమ్మార్వో బుద్ధి మారలేదు

May 02, 2016 | 01:34 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Dahegam MRO Vishwamber in ACB net

ప్రస్తుతం ఉన్న చట్టాలను అనుసరించి ఓ ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేస్తే అతగాడిపై కఠిన చర్యలు అమలవుతున్నాయి. అవినీతిని సహించబోమంటున్న కేసీఆర్ సర్కార్ హయాంలో ఇది ఇప్పుడు బాగా అమలు అవుతుందని చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ ఓ ఎమ్మార్వో గారు మాత్రం ఇప్పటిదాకా ఆరుసార్లు లంచం తీసుకుంటూ దొరికాడు అయినా ఆయనగారిలో ఏ బెణుకు లేదు. వివరాల్లోకి వెళ్లితే... ఆదిలాబాద్ జిల్లా దహేగాం తహశీల్దార్ విశ్వంబర్ ఇప్పటికే ఐదుసార్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. తాజాగా ఓ భూమికి సంబంధించి పత్రాల్లో పేరు మార్చేందుకు 15 వేలు లంచం డిమాండ్ చేశారు. సదరు రైతు ఇచ్చిన ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. విశ్వంబర్ కార్యాలయంతో పాటు ఆయన నివాసంలో కూడా ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, లంచం తీసుకుంటూ ఐదుసార్లు పట్టుబడ్డ విశ్వంబర్ తన తీరు మార్చుకోకపోవడం గమనార్హం. పైగా తనకు పెద్ద నేతల అండ ఉందని బహిరంగంగానే వ్యాఖ్యానించడం కోసమెరుపు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ