ఒక్క రోజుకే 180 కోట్లు తగలేశారంట

January 02, 2015 | 10:59 AM | 55 Views
ప్రింట్ కామెంట్

కొత్త సంవత్సరం ’కిక్‘ కోసం జనాలు బీభత్సంగా ప్రయత్నిస్తుంటారు. అయితే ఇందులో హైదరాబాదీల స్టైలే వేరు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా భాగ్యనగర్ వాసులు ఖర్చు చేసింది ఎంతో తెలుసా? అక్షరాల రూ.180 కోట్లు. ఒక్క రాత్రిలోనే విందు, వినోదాల కోసం హైదరాబాదీలు ఇంతగా ఖర్చు చేశారంట. అయితే బయట స్టార్ హోటళ్లు, రిసార్టుల్లో జరిగిన వేడుకలతోపాటు తమ సొంత ఇళ్లల్లో చేసుకున్న చిన్నపాటి వేడుకల ఖర్చులన్నీ ఇందులోనే ఉన్నాయి. ఇక ఈ మొత్తం వ్యయంలో ఏ అంశానికి ఎంతేసి ఖర్చు పెట్టారన్న అంశాన్ని పరిశీలిస్తే రూ.80 కోట్లను మద్యం కోసం ఖర్చుచేశారట. కూల్ డ్రింక్స్ కోసం రూ.15 కోట్లు, ఆహార పదార్థాల కోసం రూ.25 కోట్లను వెచ్చించారట. టాలీవుడ్, బాలీవుడ్ తారలతో స్పెషల్ డాన్స్ షో ల కోసం దాదాపు రూ.60 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది. ప్రతియేడు జరిగే తంతే కదా... ఇదేమంతా వింతేం కాదు అంటు భుజాలు ఎగరేస్తున్నారు ఇక్కడి జనాలు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ