వ్యభిచార కూపంలో చిక్కుక్కుపోయిన ఓ టాలీవుడ్ నటికి గోవా పోలీసులు ఎట్టకేలకు విముక్తి కల్పించారు. తెలుగు హిట్ చిత్రాలతోపాటు కొన్ని హిందీ చిత్రాలలో నటించిన ఈ నటి గత కొద్ది కాలంగా వ్యభిచార వృత్తిలో మగ్గుతోంది. గోవా పనాజీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ పై పోలీసులు మంగళవారం దాడులు జరిపారు. ఈ రైడింగ్ లో బడా బాబులకు అమ్మాయిలను సరఫరా చేసే అయేషా అనే ప్రదాన సూత్రధారి దొరికింది. ముందుగా సమాచారం అందుకున్న పోలీసులు ఓవ్యక్తిని అయేషా వద్దకు పంపారు. అతని ద్వారా ఆమెను ట్రాప్ చేసి పట్టుకున్నారు. ఈ రైడింగ్ లో ఆమెకు సహకరించిన మరో వ్యక్తి పారిపోయాడు. ఆమె ఉచ్చులో మగ్గుతున్న పదుల సంఖ్యలో యువతులకు పోలీసులు విముక్తి కల్పించారు. వీరిలో మన (టాలీవుడ్) నటి కూడా ఉంది. అయితే సదరు నటి పేరు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. వారందరిని ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.