భానుడి భగభగపై ఐఎండీ అలర్ట్

May 23, 2015 | 04:18 PM | 35 Views
ప్రింట్ కామెంట్
heat_waves_kills_telugu_states_people_niharonline

దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయికి చేరుకున్న నేపధ్యంలో భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శనివారం దేశంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు భానుడి భగభగకి రెండు తెలుగు రాష్ట్రాలు మండిపోతున్నాయి. వడగాల్పులకు ఇప్పటి వరకు దాదాపుగా 434 మంది మృత్యువాత పడ్డట్లు సమాచారం. కాగా రాగల రెండు, మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. వాయవ్య భారతం నుంచి వీస్తున్న పొడి గాలులతో విదర్భ, తెలంగాణ, రాయలసీమల్లో ఎండలు మండిపోతున్నాయి. ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత అధికం కావటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉత్తర తెలంగాణలో అయితే ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక శనివారం హైదరాబాద్ లో పగటి ఉష్ణోగ్రత 43.6 డిగ్రీలు నమోదైనట్లు తెలుస్తోంది. అత్యధికంగా ఖమ్మంలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో 67మంది, ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లాలో 64మంది వడదెబ్బకు మృతి చెందారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్‑లో 204 మంది.. తెలంగాణలో 230 మంది మరణించారు. కానీ, విపత్తు శాఖ తన ప్రాధమిక నివేదికలో ఇప్పటి వరకు కేవలం 46 మంది మాత్రమే మృతిచెందినట్లు వెల్లడించటం గమనార్హం. ఇక మృతుల కుటుంబాలకు ఆపద్భందు పథకం కింద రూ. 50 వేల ఆర్థిక సహాయం అందుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ సెగలు మరో వారం పాటు కొనసాగవచ్చునని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెలాఖరు లోపు రుతుపవనాలు రానీ పక్షంలో జూన్ లో కూడా ఈ రేంజ్ ఎండలు కంటిన్యూ అవుతాయని ఐఎండీ చెబుతోంది. సో... జనాలు జర్ర జాగ్రత్త...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ