ఫాస్ట్ పథకంపై హైకోర్టు సీరియస్

December 15, 2014 | 03:26 PM | 84 Views
ప్రింట్ కామెంట్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫాస్ట్ పథకం జీవో పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. టీడీపీ నేత పితాని సత్యానారాయణ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ లు వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. పాష్ట్ పదకం వేర్పాటువాదం ప్రోత్సహించేదిగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. గతంలో కూడా వివిధ ప్రాంతాల ,రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నప్పుడు ఇలా 1956 అని కట్ ఆఫ్ పెట్టి విద్యార్ధులకు ఆర్దిక సాయం చేసే ఆలోచన ఎలా చేస్తారని హైకోర్టు గతంలో ప్రశ్నించింది.దీనిపై కౌంటర్ వేయాలని హైకోర్టు కోరింది.కాని ఇంతవరకు కౌంటర్ వేయలేదు.దీనిపై విచారణ లో ఎజి మాట్లాడుతూ ఇది కేవలం గైడ్ లైన్స్ కోసం తయారుచేసిన విషయమని, పాస్ట్ అమలులోకి రాలేదని వివరించారు.కౌంటర్ దాఖలు చేయడానికి మరోసారి అవకాశం ఇస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. దీనిపై ఐదుగురు సభ్యులతో కూడిన ఓ కమిటినీ వేశామని, నివేదిక సంక్రాంతి తరువాత వస్తుందని టీ సర్కార్ కోర్టు తెలిపింది. దీంతో పూర్తి నివేదిక వచ్చాకే స్పందిస్తామని తెలుపుతూ తదుపరి విచారణను సంక్రాంతి తర్వాతకి కోర్టు వాయిదా వేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ