కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిల మధ్య జరిగింది చిన్న కొట్లాట మాత్రమే అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీనియర్ నేత వీ. హనుమంతరావు అన్నారు. ఈ విషయంపై అనవసర రాద్ధాంతం చేయకుండా లైట్ తీసుకోవాలని తనదైన శైలిలో ఆయన మీడియాకు సూచించారు. ఇద్దరూ గొడవను మర్చిపోయి, పార్టీ కోసం పనిచేయాలని చెప్పారు. ఇదే సమయంలో బీజేపీపై వీహెచ్ మండిపడ్డారు. హిందుత్వ అంశాన్ని తెరమీదకు తెచ్చి ప్రజలను బీజేపీ రెచ్చగొడుతోందని ఆరోపించారు. యువనేతల్లారా పెద్దాయన మాట వినండయ్యా కాస్తా...