ఒక ఊరు కాని పట్నం కాని అభివృధ్ది చెందిందా లేదా అన్న విషయం మనకు తెలియాలంటే మొట్టమొదటిగా రోడ్డునే చూస్తాం. అలాంటి రోడ్డు బైపాస్ గానే కాదు నెత్తుటి దారిగా మారుతుందంటే ఊహించడమే కష్టం. కానీ... తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని పెద్దకుంట తాండా అనే కుగ్రామంల మగ వాళ్లను కోల్పోయి వితంతువుగా మారింది కేవలం అక్కడ 2006 ప్రారంభమైన హై వే రోడ్డు వల్లే అనటంలో ఆశ్చర్యం లేదు.
ఆడవారి నుదుటి రాతను మార్చిన ఈ రహదారితో దాదాపు 20 నుండి 40 ఏళ్ల లోపు ఉన్న ఆడవారు వితంతువులయ్యారు.
రాత్రికాల సమయంలో ఎవరెవరో వచ్చి ఇళ్ల తలుపులు కొడుతుంటే తమకు మగ దిక్కులేక వారి అరాచకాలకు దిక్కు తోచని స్థితిలో పడిపోతున్నారు. ఎన్ హెచ్ 44కు బైపాస్ పడటంతో తమ ప్రయాణాలు సులభమవుతాయిని తాండా వారు ఆశపడ్డారు. అయితే వారికి సర్వీసు రోడ్డు రాలేదు. కాని బైపాస్ కారణంగా ఈ ఊరి వారి బతుకులు యమనగరికి సమీపమయ్యాయి.
మగ దిక్కు లేక తమతో పాటు పిల్లల పోషణ కరువై, గత్యంతరం లేక వీరు వ్యభిచార వృత్తికి చేరువవుతున్నారు. వీరికి ప్రభుత్వం నెలవారి పించన్లు అందించినప్పటికీ, బైపాస్ దాటి దాదాపు 5 కిలో మీటర్ల దూరంలోని పంచాయతీ కేంద్రం నందిగామకు వెళ్లాల్సి వస్తుండటంతో కత్తిమీద సాము అవుతుంది. నెలకో సారి బైపాస్ దాటాలన్నా కూడా వారిక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుంది. అసలు విషయం ఏమిటంటే ఈ ఊరిలో ఒకే ఒక్క మగాడు ఉన్నాడు అతని వయసు దాదాపు 6 సంవత్సరాలు ఉంటుంది.