తెలంగాణ బిడ్డలపై తప్పదా ఈ అప్పుల భారం...

September 18, 2015 | 11:25 AM | 1 Views
ప్రింట్ కామెంట్
KCR_with_Peoples_niharonline

తెలంగాణ ప్రజలను తృప్తి పరిచే విధానంపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసిఆర్ అడిగిన వారికల్లా వరాల జల్లు కురిపిస్తుండడంతో తనకు తెలియకుండానే తన ప్రజలను అప్పుల ఊబిలోకి నెడుతున్నారు. గుజరాత్ తరువాత తెలంగాణ ఆదాయం మిగిల్చే రాష్ట్రమన్న ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదాయం మిగులు మాటేమో గాని అప్పుల ఊబిలో పడిపోయారు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెస్ వారి కథనం ప్రకారం రూ. 61 వేల కోట్ల రుణాన్ని అధిక వడ్డీతో తీసుకోవడం వలన ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డపై దాదాపు రూ. 20 వేల అప్పు భారం పడనుందని వాపోయారు. అయితే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో పడవచ్చని ఫోరం అధ్యక్షులు మరియు హైకోర్టు మాజీ జస్టిసె అభిప్రాయపడ్డారు. ఇకనైనా ముఖ్యమంత్రి దృష్టి సమస్య పరిష్కారం వైపు కేంద్రీకరించాలని మరియు పాలనా పరమైన ఖర్చులను తగ్గించుకోవాలని వీరు సూచించారు. ఈ ప్రభావం ప్రజలపై పడుతూనే ఉంది. ఇక తెలంగాణ బిడ్డలకు వడ్డీల భారం మోయక తప్పదా...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ