రావుసార్ రాంగ్ నెంబర్ ఇచ్చారు

January 12, 2015 | 03:11 PM | 32 Views
ప్రింట్ కామెంట్

తెలంగాణా ప్రజలంతా గర్వపడేలా, ఆనందపడేలా సి.ఎం కేసీఆర్ ఆదివారం వరంగల్ లో ఒక అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఆయన లంచంపై ఉక్కుపాదం మోపాలని బలంగా అనుకున్నారేమో... ఏ గవర్నమెంట్ ఆఫీసులోనైనా లంచం తీసుకుంటున్నట్టు తెలిస్తే వెంటనే ఫోన్ చెయ్యండని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. అది... 040-23454071. ఇది విన్న జనాలు చాలా ఆనందించారు... మనకూ మంచి రోజులొస్తున్నాయనీ పండగ చేసుకున్నారు... కానీ... అంతలోనే షాకయ్యారు కూడా. సి.ఎం ఇచ్చింది రాంగ్ నెంబర్. ఇది ఆరోగ్యశ్రీ కాల్ సెంటర్ కు వెళుతోంది. రికార్డు చేసిన ఐదు ప్రశ్నలను ఆరోగ్యశ్రీకి సంబంధించినవి అడుగుతోంది. ఈ నెంబర్ ఇటు ఆంధ్రప్రదేశ్ కూ, తెలంగాణకు కూడా పనిచేస్తోంది. మరి.... ఈ తప్పెలా జరిగింది సి.ఎం గారూ వెంటనే దీన్ని సవరించండి....

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ