టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటుగా స్పందించారు. ‘తెలంగాణలో టీఆర్ఎస్ కు పునాదులు లేవని వారన్నారు కదా... బీజేపీకి పుట్టగతులు కూడా లేవు’ అంటూ ఘాటుగా బదులిచ్చారు. ఎన్నికలు జరిగితే తెలంగాణలో టీఆర్ఎస్ గెలుస్తుందో... బీజేపీ గెలుస్తుందో అందరికి తెలుసని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి సంస్థాగత నిర్మాణం లేదని... రాష్ట్రంలో బీజేపీ బలపడటానికి ఇదే కీలకమైన సమయమని ఇటీవల పర్యటన సందర్భంగా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై స్పందించాల్సిందిగా కేసీఆర్ ను మీడియా ప్రతినిధులు కోరగా... ఆయన ఇలా బదులిచ్చారు.