కాంగ్రెస్ అధికార ప్రతినిధి, రెండు తెలుగు రాష్ర్టాల వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహాం ఓ రేంజ్ లో మండిపడ్డాడు. మహారాష్ట్రలో ఎంఐఎం, బీజేపీలు కలిసి రాజకీయాలు చేస్తున్నాయని, బలనిరూపణ సమయంలో ఎంఐఎం దూరంగా ఉండి పరోక్షంగా బీజేపీ కి మద్ధతు తెలిపిందని దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. దీనికి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించాడు. సిగ్గుంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎంఐఎంకు కాంగ్రెస్ మద్ధతును ఉపసంహరించుకోవాలని సవాలు విసిరాడు. తమ పార్టీకి ఎంఐఎంలాంటి మతఛాందస పార్టీలతో పొత్తుపెట్లుకోవాల్సిన అవసరం ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మాటలు కాంగ్రెస్ దివాలాకోరుతనానికి నిదర్శమని తెలిపారు. డిగ్గి రాజా... మాజీ ముఖ్యమంత్రి, రాజకీయాల్లో తలపండి ఉన్న మీరు ఇలాంటి ‘పనికిరాని’ ఆరోపణలు చేయడంతో కిషన్ రెడ్డికి మండినట్టుంది.