తెలుగు ఎంపీలకు రాజ్ నాథ్ ఝలక్

November 24, 2014 | 05:09 PM | 33 Views
ప్రింట్ కామెంట్

పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఆదివారం జరిగిన అఖిలపక్ష భేటీలో ఓ ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుందట. ఇరు రాష్ర్టాల తెలుగు ఎంపీలకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఓ ఝలక్ ఇచ్చారని సమాచారం. శంషాబాద్ విమానాశ్రయం దేశీయ టర్మినల్ వ్యవహారాన్ని అఖిలపక్ష భేటీలో టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి లేవనెత్తారు. కేంద్ర నిర్ణయాన్ని తెలంగాణ పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయని రాజ్ నాథ్ కు ఎంపీ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ తోట నరసింహం జితేందర్ రెడ్డి పక్కనే కూర్చోని ఉన్నారు. ఆయనమో కేంద్ర నిర్ణయంతో ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. దీంతో హోంమంత్రి కలుగజేసుకుని ‘పక్కపక్కనే కూర్చున్నారు... ఈ సమస్యను మీరు పరిష్కరించుకోలేరా? ముందు మీరు చర్చించుకుని ఒక ఏకాభిప్రాయనికి రండి’ అని అన్నారట దీంతో విస్తుపోవడం మన తెలుగు ఎంపీల వంతు అయ్యిందని సమాచారం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ