హైదరాబాదీ బిర్యానీకి అంత సీన్ లేదా?

December 22, 2015 | 12:38 PM | 4 Views
ప్రింట్ కామెంట్
no-gir-hyderabadi-biryani-parliament-niharonline

భాగ్యనగర వాసులకే కాదు యావత్తు ప్రపంచ జనాభాకు నోరూరించే పసందైన వంటకంగా ప్రాముఖ్యత పొందింది మన హైదరాబాదీ బిర్యానీ. ముఖ్యంగా ఇక్కడ కాలుపెట్టే ప్రతి వ్యక్తి బిర్యానీ రుచి చూడనిది హైదరాబాద్ వీడి వెళ్లలేరు. అయితే ఎంతోమందికి ఫేవరెట్ డిష్ గా ఉన్న ఈ బిర్యానీకి ఇప్పటివరకు అంతర్జాతీయ గుర్తింపు అధికారికంగా అయితే లభించలేదు. జి.ఐ.ఆర్ (భౌగోళిక సూచీ నమోదు కేంద్రం) గుర్తింపు ఈ బిర్యానీకి ఇంకా లభించలేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్ సభలో వెల్లడించారు. ఈ అంశంపై టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి సభలో అడిగిన ప్రశ్నకుగాను మంత్రి స్పందించారు.

హైదరాబాదీ బిర్యానీకి గుర్తింపు కోరుతూ 2009 జులై 28న దరఖాస్తు నమోదయిందని చెప్పారు. అయితే 2010 సెప్టెంబర్ 5, 2013 ఏప్రిల్ 28 తేదీల్లో జరిగిన సంప్రదింపుల బృంద సమావేశాల్లో దరఖాస్తును ప్రభుత్వం చట్ట ప్రకారం పరిశీలించిందని తెలిపారు. కానీ ప్రభుత్వం కోరిన ఇతర పత్రాలను దరఖాస్తుదారుడు ఇంకా సమర్పించలేదని పేర్కొన్నారు. దానివల్ల హైదరాబాద్ బిర్యానీకి జిఐఆర్ గుర్తింపు రాలేదని వివరించారు. అయితే ఫ్రెంచ్ భాషకు ప్రామాణిక గ్రంథంగా పేరుగాంచిన డిక్షనరీలో మాత్రం మన బిర్యానీకి ఎప్పుడో చోటు దక్కింది. ఈ తరహా ఖ్యాతిగాంచిన బిర్యానీకి ఫ్రెంచ్ డిక్షనరీ ‘లి పెటిల్ లారౌసె’... ‘మిక్స్ డ్ రైస్ డిష్’ అని అర్థం చెప్పింది. ఫ్రెంచ్ బాషలో లారౌసేకు ప్రామాణిక గ్రంథంగా పేరుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ