అసభ్య ప్రవర్తనకి నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

November 13, 2015 | 10:39 AM | 3 Views
ప్రింట్ కామెంట్
nampally-court-decision-clerk-kiss-student-case-niharonline

నిర్భయ ఘటన తర్వాత దేశంలో మహిళల పట్ల జరిగే అఘాయిత్యాలకు గట్టి శిక్షలు పడాలనే నినాదం ఊపందుకుంది. అయితే వాటి అమలులో మాత్రం న్యాయవ్యవస్థ ఎందుకో తీవ్ర జాప్యం చేస్తుంది. అడపాదడపా కొన్ని కొర్టులు కఠిన శిక్షలు విధిస్తున్నప్పటికీ పైకోర్టులు పెండింగ్ లో ఉంచటమో, లేక వాటిని కొట్టివేయటమో జరుగుతూ వస్తుంది. అయితే తాజాగా నాంపల్లి కోర్టు ఇచ్చిన ఓ తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

                  హైదరాబాద్ లోని అమీర్ పేట పరిధిలో వెంగళరావునగర్ లోని నలంద పాఠశాలలో హరగోపాల్ అనే వ్యక్తి క్లర్కుగా పనిచేస్తున్నాడు. గతేడాది డిసెంబర్ లో పాఠశాలకు చెందిన ఓ విద్యార్థినిని పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. దీనిపై బాలిక తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. వెనువెంటనే బాలిక తల్లిదండ్రులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో హరగోపాల్ పై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ సెక్షన్ 376, ఫోక్స్ యాక్ట్ కింద పోలీసులు హరగోపాల్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ నాంపల్లి సిటీ సివిల్ కోర్టులో సుదీర్ఘంగా సాగింది. బాధితురాలి తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇటీవలే ఈ కేసులో వాదనలు ముగియగా, సిటీ సివిల్ కోర్టు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ నిందితుడిని దోషిగా నిర్ధారించారు. దీంతో పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ నిన్న సంచలన తీర్పు చెప్పారు.

సాధారణంగా అత్యాచారం, లైంగిక వేధింపులు లాంటి ఘటనలోనే కొన్ని కోర్టులు నిందితుల పట్ల క్షమాగుణాన్ని ప్రదర్శిస్తుంటాయి. కానీ, ఈ తీర్పుతో శిక్ష విషయంలో మిగతా న్యాయస్థానాలకు కాస్త ఆదర్శంగా నిలిచింది నాంపల్లి కోర్టు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ