అక్కయ్య వచ్చేస్తుందండోయి

November 18, 2014 | 01:28 PM | 29 Views
ప్రింట్ కామెంట్

తెలంగాణ వైఎస్సార్సీపీ అధినేత్రి, వైఎస్ జగన్ సోదరి షర్మిల త్వరలో రాష్ట్రంలో పర్యటించున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ తరపున తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. తాజా వార్త ప్రకారం ఈ పర్యటన డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కావచ్చునని సమాచారం. సార్వత్రిక ఎన్నికల తర్వాత రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్న షర్మిల, జగన్ తెలంగాణ సారథ్య బాధ్యతలను అప్పగించినట్లు ప్రకటించిన తర్వాత కూడా సీన్ లోకి రాలేదు. స్వతహాగా మొదటి నుంచి సమైక్యానికి మద్ధతు తెలిపి ఆ పార్టీ తెలంగాణలో అడ్రస్ లేకుండా పోయింది. గతంలో జగన్ ఓదార్పు యాత్ర సందర్భంగా రాళ్ల దాడులు జరిగిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు ఏ మొహంతో జనాల్లోకి రావాలో తెలీక తండ్రి నుంచి అచ్చోచ్చిన ఫార్మూలాను ఫాలో అవ్వాలనుకుంటుంది. ఇందులో భాగంగానే తెలంగాణలో ప్రతి ఒక్క రైతుకు తమ పార్టీ అండగా ఉంటుందని వైఎస్సార్సీపీ ప్రకటించేసింది. తెలంగాణలో ఏ రైతు ఆత్మహత్యకు పాల్పడొద్దని, చనిపోయిన కుటుంబాలకు పార్టీ తరపున నష్ట పరిహారం అందజేయనున్నట్లు తెలిపింది. సో, దాదాపు 400 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటేనే కానీ వైఎస్సార్సీపీ ఈ సమస్య తీవ్రత తెలిలేదన్నమాట. ఇక ఈ చర్యలు పార్టీని తెలంగాణలో పున:ప్రతిష్టించుకోడానికా? సమస్యలపై పోరాటానికా? లేక ఇంకా ఓదార్పు యాత్రేనా ? క్లారిటీ ఇవ్వండి ప్లీజ్ అని విశ్లేషకులు సైతం సెటైర్లేస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ