కేంద్ర ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలకు తెలంగాణ ప్రభుత్వం లిస్ట్ రెడీ చేసింది. ఈ పురస్కారాల కోసం చాలా రోజుల కసరత్తుల తర్వాత పలువురి పేర్లను సిఫారసు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇస్తున్న అవార్డులు కావడంతో రాష్ట్రానికి వీలైనన్ని పద్మ పురస్కారాలు సంపాదించాలనే కృత నిశ్చయంతో ఉంది. దీని కోసం అర్హులైన 23 మంది పేర్లతో కూడిన జాబితాను తయారు చేసింది. ఈ అవార్డులపై చర్చించాలని మంత్రి హరీశ్ రావు, సలహాదారు రమణాచారి, సిఎస్ రాజీవ్ శర్మలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న, జయశంకర్ కు పద్మభూషణ్, ఆంధ్రా యూనివర్సిటీల సార్వత్రిక విశ్వవిద్యాలయాల తొలి వీసీ ప్రొఫెసర్ జి.రామిరెడ్డికి పద్మవిభూషణ్ ఇవ్వాలని ప్రభుత్వం సిఫారసు చేసింది. వీరితో పాటు...డాక్టర్ ఎన్.గోపి, చుక్కా రామయ్య, మిథాలీ రాజ్, సుద్దాల అశోక్ తేజల పేర్లు కూడా ప్రభుత్వం సిఫారసు చేసిన లిస్టులో ఉన్నాయి ఉన్నాయి.