తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కేజీ టూ పీజీ కార్యక్రమంపై ప్రతిపక్ష కాంగ్రెస్ సెటర్లు వేస్తుంది. ఈ ప్రభుత్వాన్ని టీఆర్ ఎస్ నీరుగార్చాలని చూస్తోందని టీ కాంగ్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఎంతో గొప్పదైన ఈ పథకాన్ని పట్టాలెక్కించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు వచ్చినా కేజీ టూ పీజీ పథకం పూర్తికాదని ఎద్దేవా చేశారు. ఈ పథకం కింద వేలాది కోట్లు దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్యాహక్కు చట్టాన్ని సైతం ఈ ప్రభుత్వం కనీసం అమలుచేయటం లేదని జీవన్ రెడ్డి మండిపడ్డారు.