కేటాయింపులు సరిగ్గా లేవంటున్న టీ ప్రభుత్వం

December 01, 2014 | 03:32 PM | 25 Views
ప్రింట్ కామెంట్

కృష్ణా ట్రిబ్యునల్ జరిపిన నీటి కేటాయింపులు సక్రమంగా లేవంటూ తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేయాలని ఎప్పటి నుంచో భావిస్తుంది. ఈ మేరకు సోమవారం సుప్రీంలో ఈ విషయమై పిటిషన్ దాఖలు చేసింది. ట్రిబ్యునల్ చేపట్టిన కేటాయింపులు అవకతవకగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యక్తంచేసింది. సమీక్ష చేపట్టి కేటాయింపుల ప్రక్రియ మళ్ళీ చేపట్టాలని కోరింది. కాగా, ఈ పిటిషన్ విచారణ అర్హతపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆయా రాష్ట్రల సీఎస్ లను ఆదేశించింది. కేసు విచారణను ఫిబ్రవరి 11కు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం జలాశయంలో లెక్కకు మించి విద్యుత్ ఉత్పత్తిని చేస్తొందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేయడం, ట్రిబ్యునల్ చర్యలకు ఉపక్రమించటం తెలిసిన విషయమే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ