ఎట్టకేలకు జూనియర్ డాక్టర్ లు దిగొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో గత 64 రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు శనివారం సమ్మెను విరమించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవించి సమ్మె విరమించినట్టు వైద్యులు తెలిపారు. మధ్యాహ్నం నుంచి విధులకు హాజరవుతున్నట్లు ప్రకటించారు. విధుల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాలని (రూరల్ సర్వీస్) నియమాన్ని తప్పని సరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నంబరు 107ను కొన్ని రోజుల కిందట జారీ చేసింది. దానిని నిరసిస్తూ జూడాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే తమ డిమాండ్లకు తలోగ్గకుండా తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కఠిన వైఖరి అవలభిస్తుందని జూడాలు ఆరోపిస్తు వస్తోంది. సమ్మె విషయంలో మొండిగా వ్యవహరించోద్దని హైకోర్టు మొదటి నుంచి చెబుతున్నప్పటికీ జూడాలు అంతగా పట్టించుకోలేదు. ఇక న్యాయస్థానం తీవ్ర చర్యలకు ఉపక్రమించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించటంతో జూడాలు దిగొచి సమ్మె విరమించారు.